Headlines (Telugu):
-
“సీపీఐ 100 సంవత్సరాల ఉత్సవాలు: భద్రాద్రి కొత్తగూడెంలో ఘనంగా జరుపుకుందాం!”
-
“2025 సభ్యత్వ లక్ష్యాన్ని చేరుకోండి: సీపీఐ శ్రేణులకు MLA కూనంనేని పిలుపు”
-
“పోడు భూముల పట్టాలకోసం మరో ఉద్యమం అవసరం: సీపీఐ నాయకుల వ్యాఖ్య”
-
“పాల్వంచ సమగ్రాభివృద్ధిపై సీపీఐ ప్రత్యేక శ్రద్ధ”
-
“గ్రామ గ్రామాన సీపీఐ వందేళ్ల ఉత్సవాలు నిర్వహణ”
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ప్రజాపోరాటాలతోనే జనాదరణ.
2025 సభ్యత్వ లక్ష్యాన్ని పరిపూర్తి చేయాలి అన్నారు.
పోడు భూముల పట్టాలకోసం మరో ఉద్యమం చేపడదాం.
పాల్వంచ ప్రాంత సమగ్రాభివృద్ధిపై ఎమ్మెల్యే కూనంనేని ప్రత్యేక శ్రద్ద.
గ్రామ గ్రామాన సిపిఐ వందేళ్ల ఉత్సవాలు జరుపుకుందాం.
పాల్వంచ మండలంలో మరింతగా సీపీఐ నీ విస్తరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి SK సాబీర్ పాషా అన్నారు. మంగళవారం స్థానిక చండ్ర రాజేశ్వరరావు భవన్ లో సీపీఐ మండల కౌన్సిల్ సమవేశం గుండాల నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రజాపోరాటాలతోనే మండలంలో రోజు రోజుకు సీపీఐ కి జనాదరణ వస్తుందిని అన్నారు. డిసెంబర్ 26 నాటికి పార్టీ వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో గ్రామ గ్రామాన వందేళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించి పార్టీ చరిత్రను, త్యాగాలను ప్రజలకు వివరించాలని, ప్రతి గ్రామం, బస్తీలో ఉత్సవాలు ఘనంగా జరిగేలా ప్రణాళిక రూపొందించుకోవాలని పిలుపునిచ్చారు. 2025 సభ్యత్వ చేర్పింపు, పునరుద్ధరణ లక్ష్యాలను పూర్తిచేసి గ్రామ స్థాయి, మండల స్థాయి మహాసభలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని కోరారు. పాల్వంచ ప్రాంత సమగ్ర అభివృద్ధిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ద్రుష్టి సారించారని, ఇప్పటికే వివిధ పథకాలతో రోడ్లు, డ్రైన్లు, నీటి పథకాలు శరవేగంగా పనులు పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన పనులు త్వరలో ప్రారంభం అవుతాయన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని తెలిపారు. పోడు భూముల సమస్యను పరిష్కరించకుంటే కోసం మరో ఉద్యమం చేపడతామని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల విశ్వనాథం, జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీను, మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, ఉప్పుశెట్టి రాహుల్, వీ పద్మజ, ఏఐటీయూసీ మండల అధ్యక్షకార్యదర్శులు అన్నరపు వెంకటేశ్వర్లు, ఇట్టి వెంకట్రావు, మన్నెం వెంకన్న, కొత్త సురేష్, వేములపల్లి శ్రీను, జకరయ్య, కొంగర అప్పారావు, జక్కుల లింగేశ్వర్, ఎల్లంకి శివరావు, మాజీ ఎంపీటీసీ ఉండ్రతి శ్రీను, గురుమూర్తి, ఖాసీం, గురవయ్య, వెంకట ముత్యం, మాజీ సర్పంచులు భూక్య విజయ్, మాలోత్ హరి, సపవట్ వెంకటరమణ, జర్పుల మోహన్, బాదావత్ శ్రీను, శెట్టి ప్రసాద్, అమృత రావు, వజ్జా వాసు, మేరమ్మ, రంజిత్, సిహెచ్ శ్రీను, ఎర్రగడ్డ ప్రభాకర్, కృష్ణ, రమేష్, లచ్చిరాం, బాలు తదితరులు పాల్గొన్నారు.