భద్రాచలంలో డబుల్ బెడ్ రూమ్ పథకంపై మాల మహానాడు ఉద్యమం హెచ్చరిక
భద్రాచలం స్థానిక ఎమ్మార్వో ఆఫీసు నందు దళిత గిరిజన బిసి ఓసి వికలాంగులకు అర్హులైన వారికి డబల్ బెడ్ రూములు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు ని మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు దాసరి శేఖర్ కోరడం జరిగింది. ఈ సందర్భంగా దాసరి శేఖర్ మాట్లాడుతూ భద్రాచలంలో ఉన్నటువంటి డబల్ బెడ్ రూములు అర్హులైన పేదవారికి ఇవ్వాలని గతంలో కూడా 83 డబల్ బెడ్ రూమ్ లో అమ్ముకోవడం జరిగిందని.అప్పుడు పరిస్థితి రాకుండా చూడాలని అనర్హులకు అందకుండా ఇల్లులు ఉండి డబ్బున్న వారే కొనుకుంటున్నారని డబల్ బెడ్ రూములు మంజూరు చేసుకున్నాక అద్దెలకిచ్చుకుంటున్నారని అన్నారు ఇకనైనా పేదవారికి ఇవ్వకపోతే మాల మహానాడు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్వహిస్తామని దాసరి శేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో రామారావు చిట్టిబాబు దేవరాజ్ రమేష్ శీను తదితరులు పాల్గొన్నారు.