డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

కలెక్టర్
Headlines
  1. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే డేటా ఎంట్రీపై కలెక్టర్ ఆదేశాలు
  2. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సమగ్ర ఇంటింటి సర్వే: డేటా ఎంట్రీలో జాగ్రత్తలు తీసుకోండి
  3. డేటా ఎంట్రీ పై కలెక్టర్ జితేజ్ వి. పాటిల్ కీలక ఆదేశాలు
  4. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: 29వ తేదీలోపు సమగ్ర సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయాలి
  5. సమగ్ర ఇంటింటి సర్వే కోసం జూమ్ వీడియో కాన్ఫరెన్స్: అధికారుల ఆదేశాలు

.ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వివరాల డేటా ఎంట్రీలో ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేజ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సమగ్ర ఇంటింటి సర్వే డేటా ఎంట్రీ పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, డిపిఓ చంద్రమౌళి, విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర చారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తాసిల్దార్ లు, డిప్యూటీ తాసిల్దారులు, ఎంపీడీవోలు, ఎంపీ వోలు మరియు ఎంసీలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే( సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) వివరాలను అత్యంత జాగ్రత్తగా ఈనెల 29వ తారీకు లోపు ఆన్ లైన్ లో నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తాసిల్దారులందరూ తప్పనిసరిగా రేపు సాయంత్రం లోపు ఇంకా పూర్తికాని గృహాల సర్వేను తప్పకుండా పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి చేసిన సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేసినందుకు గాను ఒక్కో డేటా ఎంట్రీ కి ప్రభుత్వంరూ ,,7 రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించింది. డేటా ఎంట్రీ ప్రక్రియను ఈ 5 పని దినాలలో పూర్తి చేయు విధంగా ప్రణాళికలను సిద్ధం చేయాలని, రెండు షిఫ్ట్లలో డేటా ఎంట్రీ ప్రక్రియ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మరియు రెండవ షిఫ్ట్ 5 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. దానికి అవసరమైన కంప్యూటర్లను అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట కంప్యూటర్ లను 5 రోజులకు అద్దెకు తెచ్చి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. డేటా ఎంట్రీ కోసం తాసిల్దార్లు తమ మండలాల్లో లేదా పక్క మండల లోని కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలల ల్యాబ్ లను ఉపయోగించుకోవచ్చు అన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎన్యుమరేటర్ కలిసి సర్వే వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు. సర్వే పత్రాలను భద్రంగా భద్ర పరచాలన్నారు. సర్వే పత్రాల భద్రత విషయంలో సూపర్వైజర్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. అదేవిధంగా సర్వేకు సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచాలన్నారు.డేటా ఎంట్రీ చేయడంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు అత్యంత కీలకంగా వ్యవహరించాలన్నారు. కుటుంబాల వివరాలు అంశాలవారీగా ప్రత్యేక ఫార్మేట్లో నమోదు చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. అంశాల వారిగా ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఆన్లైన్లో నమోదు చేయాల్సిన బాధ్యత ఆపరేటర్లపై ఉందన్నారు. ఒక ఆపరేటర్ కు నిర్దేశించింది న కుటుంబాల సంఖ్య ఆధారంగా ఆన్లైన్లో వారి వివరాలను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నమోదు చేయాలన్నారు. వివరాలు ఆన్లైన్ నమోదు ప్రక్రియను సూపర్వైజర్లు ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. డేటా ఎంట్రీ లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే పై అధికారులకు తెలియజేయాలన్నారు. డేటా ఎంట్రీ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment