Site icon PRASHNA AYUDHAM

తహసిల్దార్ అతి ఉత్సాహం పేదల కందని డబల్ బెడ్ రూమ్

పేదల
Headlines :
  1. తహసిల్దార్ ఉత్సాహం పేదల సొంత ఇల్లు కలలు అన్నమాట!
  2. భద్రాచల: మహాజన మహిళా సమైక్య తహసిల్దార్ నిర్ణయాన్ని ఖండిస్తుంది
  3. పేదలకు ఇళ్లు ఇవ్వకున్న తహసిల్దార్ పై మహాజన మహిళా సమైక్యా పోరాటం

స్థానిక ఆదర్శనగర్ కాలనీ నందు మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ అత్యవసర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశ ఉద్దేశించి మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత మాట్లాడుతూ భద్రాచల పట్టణంలో అనేకమంది నిరుపేదలు ఇల్లు లేక అద్దెల కట్టలేక దుర్భర జీవితాన్ని కడుపుతున్నారని ఏ ప్రభుత్వ వచ్చిన పేదలను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తపరిచారు. గతంలో కట్టించిన 88 డబల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో అధిక శాతం ఆర్థికంగా ఉన్న వాళ్లకు తమకు అనుకూలమైన వాళ్లకు ఇల్లు ఇవ్వడం జరిగిందని, రెండో సారీ కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లల్లో కూడా పేదలను ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. తాసిల్దార్ ఈరోజు నామమాత్రంగా గ్రామసభ నిర్వహించుకొని అతి ఉత్సాహం ప్రదర్శించారని దుయ్యబట్టారు. తాసిల్దార్ తీసుకున్న నిర్ణయం పేద ప్రజల సొంతింటి కల గానే మిగిల్చే ప్రయత్నం అని, తాసిల్దార్ చేస్తున్న పేదల వ్యతిరేక విధానాన్ని మహాజన మహిళా సమైక్య తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. తాసిల్దార్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే మాజీన మహిళా సమ్మెకు ఆధ్వర్యంలో దశల వారి పోరాటాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాదిగ మహిళ సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు కొప్పుల నాగమణి, జిల్లా కార్యదర్శి గద్దల కృష్ణవేణి, పట్టణ నాయకురాలు బొమ్మన వేణి జ్యోతి, దేపాక నాగదుర్గ, రావుల నిర్మలమ్మ, దుబ్బల కళావతి, మడకం సత్తిబాబు, మాట్ల సంపత్ బుర్ర నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version