Site icon PRASHNA AYUDHAM

విద్యార్థి సేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ కి కొవ్వొత్తులతో ఘన నివాళి

IMG 20250323 WA0010

విద్యార్థి సేన ఆధ్వర్యంలో భగత్ సింగ్ కి కొవ్వొత్తులతో ఘన నివాళి

– ఉరికాంబను ముద్దాడిన భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్

– కొత్మీర్కర్ వినయ్ కుమార్

కామారెడ్డి జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ 94 వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అయన చిత్రపటానికి పూలమాలవేసి కొవ్వొత్తులతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మీర్కర్ వినయ్ కుమార్ మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర పోరాటంలో అగ్రనాయకుడిగా నిల్చిన మహానాయకుడు అన్నారు. ఆయన జీవితం, పోరాటం, ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దృక్పథాన్ని, మానవ హక్కుల రక్షణను ప్రోత్సహించాయి. భగత్ సింగ్ ధైర్యం, త్యాగం, స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటం సమాజంలో మార్పు కోసం, అసమానతలకు వ్యతిరేకంగా నిలబడడానికి, యువతను ప్రేరేపించాయి అన్నారు.

భగత్ సింగ్ యొక్క పోరాటం కేవలం బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూల్చడమే కాకుండా, భారతదేశంలోని అన్ని వర్గాలకు స్వాతంత్య్రం, స్వేచ్ఛ, న్యాయం కోసం తన జీవితం అర్పించిన మహానాయకుడిగా ప్రపంచం చరిత్రలో నిలిచారు. ఆయన చూపించిన మార్గంలో యువత ఉత్సాహంగా, ధైర్యంగా ముందుకు సాగాలని, సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సేన నాయకులు సురేష్, నాగరాజు, గోరవ్, కళ్యాణ్, జాదవ్, శ్రీకాంత్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

 

Exit mobile version