అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో భగత్ సింగ్ వర్ధంతి
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
అఖిల భారత విద్యార్థి సమైక్య ( ఏఐఎస్ఎఫ్ ) కామారెడ్డి జిల్లా కార్యాలయంలో భగత్ సింగ్ రాజు గురుదేవ్ 94 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించరు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మాజీ జిల్లా అధ్యక్షులు .ఎల్. దశరథ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ పి శివప్రసాద్ లు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్ గురు, సుగుదేవ్ ఆశలను కొనసాగిస్తామని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ అమలు చేయాలని, భగత్ సింగ్ వర్ధంతిని జయంతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారకంగా నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. దేశ స్వతంత్రం కోసం ఇంగ్లీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరులన్నారు. ఒక మనిషిని మరో మనిషి దోపిడి చేయ లేని సమాజం కావాలని, అందరూ సమానత్వంగా బతకాలని బానిసత్వాన్ని కొనసాగించరాదని దేశ సంపదను కొల్లగొట్ట రాదని ప్రతి పౌరునికి దేశంలో స్వతంత్రంగా బ్రతికే హక్కు ఉండాలని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారన్నారు. ఈరోజుకు 94 సంవత్సరాలు అవుతున్న దేశంలో తెల్లదొరలు పోయిన తర్వాత మరోసారి నల్లదొరలుగా దేశాన్ని దోచుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా భగత్ సింగ్ కలలు కన్నా ఆశయాలను ముందుకు తీసుకోదామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు ఎల్. సంపత్, జస్వంత్, రాజు, సాయి, సనత్, నిరంజన్, గణేష్, రాజకుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి బాలరాజు, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.