గురువులను సన్మానించుకుంటూ భగవద్గీత పారాయణం మరియు ఆషాఢమాస గోరింటాకు సంబరాలు.

*ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు*

*ప్రశ్న ఆయుధం,జులై 10 శేరిలింగంపల్లి,ప్రతినిధి*

గురువులను సన్మానించుకుంటూ భగవద్గీత పారాయణం మరియు ఆషాఢమాస గోరింటాకు సంబరాలు.

జీవితంలో మంచిగా ఉండడం, సన్మార్గంలో నడవడం, ఉన్నత శిఖరాలకు అధిరోహించడంలో మనకు ఎల్లప్పుడూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చే గురువు పాత్ర చాలా కీలకం… రవికుమార్ యాదవ్.

గురుపౌర్ణమి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు ఆల్విన్ కాలనీ డివిజన్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ రావు ఆధ్వర్యంలో ఎస్.ఎస్.డి గ్రామర్ స్కూల్ ప్రాంగణంలో నియోజకవర్గ కన్వీనర్ రాఘవేంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ గురుపౌర్ణమి వేడుకలు మరియు హఫీజ్ పేట్ డివిజన్, హుడా కాలనీ లోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద కంటేస్టెడ్ కార్పొరేటర్ అనూష మహేష్ యాదవ్ మరియు బీజేపీ మహిళా మోర్చ పార్లమెంట్ కో కన్వీనర్ పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పారాయణం మరియు ఆషాఢమాస గోరింటాకు సంబరాలలో పాల్గొని గురువులను సన్మానించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనకు చిన్నతనంలో అన్ని నేర్పే గురువులుగా తల్లిదండ్రులు, తర్వాత చదువు , విజ్ఞానాన్ని అందించే ఉపాధ్యాయులు ఇలా వారు మాత్రమే కాకుండా జీవితంలో మంచిగా ఉండడం, సన్మార్గంలో నడవడం, ఉన్నత శిఖరాలకు అధిరోహించడంలో మనకు ఎల్లప్పుడూ సరైన సూచనలు, సలహాలు ఇచ్చే ప్రతి ఒక్కరు గురువుతో సమానమే , మనం ఈరోజు అలాంటి వారిని సన్మానించుకుని వారికి మన కృతజ్ఞతలు తెలుపుతుంటాం ఎందుకంటే గురువు దేవుడితో సమానం అని అన్నారు ,ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజవర్గ, డివిజన్ ,మహిళా మోర్చ, నాయకులు, కార్యకర్తలు తదితరుకు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now