సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబరు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారతదేశ అటవీ జాతుల స్వాతంత్ర సమరయోధుడు, జానపద నాయకుడు భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చంద్రశేఖర్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మహోన్నత పోరాటాన్ని స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భారత అటవీ జాతుల స్వాతంత్ర పోరాటానికి బిర్సా ముండా ప్రేరణాత్మక చిహ్నమని, ఆయన జయంతి దేశవ్యాప్తంగా గౌరవంతో జరుపుకుంటున్నామన్నారు. అటవీ జాతుల హక్కులు, గిరిజనుల అభ్యున్నతి, స్వాభిమాన రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాలు నేటికీ ప్రేరణగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పద్మజారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు దీపిక, ప్రతిభ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు
Published On: November 15, 2025 7:07 pm