Site icon PRASHNA AYUDHAM

వేణుగోపాలస్వామి కోవెల లో భగవత్ గీతా జయంతి

*వేణుగోపాలస్వామి కోవెల లో భగవత్ గీతా జయంతి*

*ధనుర్మాస ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ*

చేర్యాల పట్టణంలో అతి పురాతన దేవాలయం శ్రీ వేణుగోపాలస్వామి కోవెలలో గీతా జయంతి ధనుర్మాస పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఆలయ ప్రధాన అర్చకులు శేష ఆచార్యులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పరిచారక అర్చక స్వామీ రాజు స్వామీ మాట్లాడుతూ

ప్రతీ మనిషి ఎలా జీవించాలో ..కూడదో …అందరిలో నిద్రాణమై ఉన్న అంతర్గత శక్తి సామర్థ్యాలను తట్టి లేపి బాధ్యతను తెలిపేదే మన భగవద్గీత అని ఇది ప్రపంచం లోని సర్వ మానవాళికి చెందినదని ..శవాల దగ్గర పెట్టేది కాదు అని మనిషి శవం అయ్యేలోపు తప్పక చదవాల్సిందే నని …చనిపోయాక కూడా బతకడం ఎలాగో నేర్పేదే భగవద్గీత అన్నారు..భగవత్ గీత పుట్టి 5164 సంవత్సరాలు అయినందున ..ఈ ప్రపంచం లో ఒక పుస్తకానికి పుట్టిన రోజు జరిపే అత్యంత గొప్ప సంస్కృతి కేవలం హైందవ సమాజానిదే నని అన్నారు.నెల 16 ఉదయం ను ధనుర్మాసం అరంభంవుతుందనీ జనవరి 10 నాడు ముక్కోటి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు తరించాలని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో వికాస తరంగని బాద్యులు .రేణిగుంట సరోజని. హరికిషన్ రామూర్తి లక్ష్మి హరినా సరస్వతి కుమార్ భద్రయ్య రాంప్రకష్ అనిత తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version