వ్యవసాయ అధికారినిగా పనిచేసిన భాగ్యలక్ష్మి బదిలీ..

IMG 20240822 WA0099

కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారినిగా పనిచేసిన భాగ్యలక్ష్మి బదిలీపై కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారినిగా వెళ్ళినందుకు వ్యవసాయ అధికారులు, టీఎన్జీవోస్ ప్రతినిధులు సన్మానం చేశారు. ఆమె కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి సన్మానించారు. ఇక్కడికి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో డి డి ఏ గా పని చేసిన తిరుమల ప్రసాద్ కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గా బదిలీపై రానున్నారు. కార్యక్రమంలో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షుడు నరాల వెంకటరెడ్డి, కార్యదర్శి సాయిలు, జిల్లా అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజారాం, ప్రతినిధులు నాగరాజు, సంతోష్ కుమార్, నర్సింలు, వ్యవసాయ అధికారులు, ఏఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now