బీజేపీ పార్టీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు ఎల్లారెడ్డి ఆర్డీఓ కి మెమోరాండం అందించి, రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళారు.
గత నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాల్లోని పలు బ్రిడ్జీలు, మరియు చెరువులు ద్వంసం అయ్యాయి. ముఖ్యంగా లింగంపేట్ మండలం లింగంపల్లి వద్ద కూలిపోయిన బ్రిడ్జి వల్ల స్థానిక రైతులు భారీ నష్టాన్ని భరించాల్సి వచ్చింది. పంటలు నష్టపోయి, రోడ్డు మౌలిక సదుపాయాలు ధ్వంసమవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో పైడి ఎల్లారెడ్డి నేతృత్వంలోని భాజాపా పార్టీ నేతలు మెమోరాండంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా రైతులకు నష్టపరిహారం ఇవ్వడం, కూలిపోయిన కామారెడ్డి-ఎల్లారెడ్డి రోడ్డును వెంటనే మరమ్మత్తు చేయడం అవసరం అని పేర్కొన్నారు. సమస్యకు తగిన పరిష్కారం లేకపోతే, భవిష్యత్తులో బీజేపీ పార్టీ మహా ధర్నా చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు.