భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జన్మ నక్షత్ర వేడుకలు

భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా జన్మ నక్షత్ర వేడుకలు

*జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 12 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట కేంద్రంలోని లోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రావణమాస ఉత్సవంలో భాగంగా శ్రీ భక్తాంజనేయ స్వామి జన్మ నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలు శ్రీరామదూత సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో విశేష అభిషేకములు అర్చనలు చేసి శ్రీ భక్తాంజనేయ స్వామి ఉత్సవమూర్తిని పల్లకి సేవ లో గ్రామ పురవీధుల గుండా తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ శ్రావణమాసంలో వచ్చే శ్రీ భక్తాంజనేయ స్వామి జన్మ నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం చాలా పవిత్రమైనదని స్వామివారిని భక్తిశ్రద్ధలతో వేడుకుంటే ఎలాంటి కార్యమైన సిద్ధిస్తాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు శ్రీమాన్ గోపినాదాచార్యులు, శ్రీమాన్ బట్టర్ శేషాచార్యులు గ్రామ ప్రజలు,ఆధ్యాత్మిక సేవకులు,మహిళా భక్తులు,శ్రీరామదూత సేవాసమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now