భక్తి మనసుకు నిలకడనిస్తుంది: MLA ధన్పాల్
నారాయణగిరిలో వాసవి ఆలయ భూమిపూజ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం, నవంబర్ 22:
గాంధారి మండలంలోని నారాయణగిరిలో వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ నిర్మాణానికి శనివారం భూమిపూజ నిర్వహించారు. అల్దిపురం మఠాధిపతి వామనాశ్రమ మహాస్వామీజీ వేదమంత్రాల మధ్య పూజలు చేపట్టగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, “భక్తి మనసుకు ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని అందించే శక్తి. మానసిక ప్రశాంతత కోసం దేవాలయ దర్శనం ప్రతి హిందువు జీవితంలో భాగం కావాలి,” అని పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పాత్ర పోషించాలన్నారు. కావడి నుంచి వారణాసి వరకు 4,500 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన మహాస్వామీజీ సేవా భావం అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
తరువాత వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ భూమిపూజ కార్యక్రమం ఘనంగా సాగింది. ఈ వేడుకలో ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడు కిషన్, పట్టణ అధ్యక్షుడు సంతోష్, నాయకులు లక్ష్మీకాంత్, దినేష్, ప్రశాంత్, సోమశేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు మరియు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది