ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు

*ప్రజాకవి నాగుల సత్యం గౌడ్ కు భారత్ వరల్డ్ రికార్డు అవార్డు*

*హుజురాబాద్ జనవరి 9 ప్రశ్న ఆయుధం*

కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మున్సిపాలిటీకి చెందిన మానవ విలువల పరిరక్షణ సేవ సంస్థ జాతీయ అధ్యక్షుడు వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇంటర్నేషనల్ భారత్ ప్రతిభ రత్న అవార్డు గ్రహీత ప్రజాకవి రచయిత సామాజికవేత్త డాక్టర్ నాగుల సత్యం గౌడ్ భారత్ వరల్డ్ రికార్డ్ అవార్డు అందుకున్నారు. అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలను సేవలను గుర్తించి, చతుష్టి కలలు, సంక్రాంతి సంబరాలు, గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా ప్రపంచ భారత్ వరల్డ్ రికార్డు అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును హైదరాబాదులోని రవీంద్ర భారతిలో గురువారం అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు కమిటీ వ్యవస్థాపకుడు కదిరి వెంకటరమణరావు తో పాటు డాక్టర్ సముద్రాల వేణుగోపాల చారి ఫార్మర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ మినిస్టర్, చకిలం అసోసియేషన్ డైరెక్టర్ చకిలం సుధాకర్, ఇంటర్నేషనల్ ఫిలిం జూరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కమిటీ డాక్టర్ నాగులపల్లి పద్మిని, టీవీ అండ్ మూవీ ఆర్టిస్టు బేబీ శ్రీదేవిలు చేతుల మీదుగా సత్యం గౌడ్ కు అవార్డు ప్రధానం చేశారు. అనంతరం సత్యం గౌడ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా భారత్ వరల్డ్ రికార్డు కమిటీ వ్యవస్థాపకులు కదిరి వెంకట రమణ రావు మాట్లాడుతూ సత్యం గౌడ్ సామాజిక, ఆధ్యాత్మిక సేవలు అభినందనీయమని విద్యార్థులు ప్రయోజకులుగా ఎదగాలనే సంకల్పంతో సెమినార్లు నిర్వహిస్తూ, ప్రతి విద్యార్థి ప్రయోజకుడిగా ఎదగాలని కాంక్షించే సత్యం గౌడ్ నిస్వార్థ సేవలు ఆదర్శప్రాయమని కవిగా, రచయితగా సమాజానికి ఉపయోగపడే రచనలు రాణిస్తూ, విలువలు పెంపొందించే రచనలు చేస్తున్న సత్యం గౌడ్ రచనలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతున్న ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ప్రజాకవి రచయిత డాక్టర్ నాగుల సత్యం గౌడ్ లాగ మారాలని ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకొని, మంచి మార్గాన్ని ఎంచుకొని సన్మార్గంలో జీవిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలన్నారు. మనం ఏర్పరచుకున్న విలువలు కాపాడుకుంటూ విలువైన పౌరులుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ దేశ రక్షణలో, దేశభక్తిలో ముందంజలో ఉండి దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందించాలని కోరారు అనంతరం సత్యం గౌడ్ మాట్లాడుతూ ఎందరో నృత్య కళాకారులను, కవులను, కళాకారులను, సామాజిక వేత్తలను, సమాజానికి ఉపయోగపడే విద్యావేత్తలను, ప్రోత్సహిస్తూ కలనే వృత్తిగా దైవంగా భావిస్తూ ఎందరికో సత్కారాలు అవార్డులు, వరల్డ్ రికార్డు అవార్డులు అందజేస్తున్న అంతర్జాతీయ భారత్ వరల్డ్ రికార్డు సంస్థ వ్యవస్థాపకులు కదిరి వెంకట రమణారావు సేవలు అభినందనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కవులు రచయితలు, గురువులు, విద్యావేత్తలు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, వివిధ సంస్థల డైరెక్టర్లు, చైర్మన్లు, న్యాయవాదులు, చిన్నారులు, నృత్య కళాకారుల తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment