భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు

గజ్వేల్ ఆగస్టు 29 ప్రశ్న ఆయుధం :

భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక కోల అభిరామ్ గార్డెన్లో “కార్యశాల“ బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. బిజెపి గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ బూత్ స్థాయి నుండి బిజెపి ని మరింత విస్తరించేలా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ముందుడాలి బిజెపి సంయుక్త మోర్చాలు పెద్ద ఎత్తున మహిళలను, యువకులను, రైతులను, ఎస్సీ, ఎస్టీ బీసీ లను సభ్యత్వ నమోదులో భాగస్వామ్యం చేయాలి పట్టణ వ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో కార్యశాలలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలకు అవగాహనా కల్పిస్తూ సభ్యత్వ నమోదు ముందుకు కొనసాగించాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా విచ్చేసిన బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం గురువా రెడ్డి, యెల్లు రాం రెడ్డి మాట్లాడుతూ జాతీయవాదాన్ని సిద్ధాంతంగా, దేశ రక్షణను లక్ష్యంగా భావించి ముందడుగు వేస్తున్న భారతీయ జనతా పార్టీ తలపెట్టిన 2024 సభ్యత్వ నమోదు మహాయజ్ఞంలో భాగస్వాములు కావలన్నారు సెప్టెంబర్ 2, 2024 నుండి ప్రారంభమయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని బిజెపిలో చేరడానికి, 88 00 00 2024 నెంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వాలన్నారు విశ్వగురువుగా భారత్ మారాలన్నా, వికసిత్ భారత్ సాకారం కావాలన్నా భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. అవినీతికి ఆస్కారం లేని పాలన, అభివృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చే బిజెపికి మరింత బలాన్ని ఇచ్చేందుకు ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం పని చేసే బిజెపికి అండగా ఉండేందుకు సభ్యత్వాన్ని స్వీకరించి, పార్టీకి మద్దతుగా నిలవాలని పట్టణ ప్రజలను కోరుతున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పెడ్యాల శ్రీనివాస్, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి మంద వెంకట్, బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు నాయిని సందీప్, మాడ్గురి నరసింహా, వడ్డేపల్లి ప్రసాద్, చెప్యాల వెంకట్రెడ్డి, మైస విజయ్, కిష్టా గౌడ్, బిజెపి నాయకులు నాగు ముదిరాజ్, బిజెపి పట్టణ కార్యదర్శిలు కొన్నే రాజశేఖర్ రెడ్డి, చెన్నోజీ నీరజ, బిజెపి పట్టణ కోశాధికారి హరికుమార్, మోర్చాల అధ్యక్షులు దువ్వాల రాజు యాదవ్, సంగేమ్ కరుణాకర్, గడ్డమీది ప్రశాంత్, మెతుకు కర్ణాకర్, బిజెపి మహిళా పట్టణ ప్రధాన కార్యదర్శిలు వినోద, అఖిల, కిసాన్ మోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిలు తలారి రాజు, మల్లేష్ యాదవ్, బిజెపి మహిళా పట్టణ ఉపాధ్యక్షురాలు మంతురి మమత, పాతూరి మమత, మణెమ్మ, పోలింగ్ బూత్ అధ్యక్షులు రామ కృష్ణ, కొమ్ము అరుణ్ తదితరులు పాల్గొన్నాను.

Join WhatsApp

Join Now