నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి పదోన్నతి

*నాగారం మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి పదోన్నతి*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20

నాగారం మున్సిపల్ కమిషనర్ ఎస్.భాస్కర్ రెడ్డి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3 నుండి గ్రేడ్-2 కు పదోన్నతి కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదోన్నతి పట్ల మున్సిపల్ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది కమిషనర్ భాస్కర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. వారు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువ కప్పి తమ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిబ్బంది మాట్లాడుతూ, భాస్కర్ రెడ్డి తమ విధులను మరింత నిబద్ధతతో నిర్వహిస్తూ, మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. భాస్కర్ రెడ్డి పదోన్నతి పొందడం పట్ల మున్సిపల్ పరిధిలో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now