రికార్డును బ్రేక్ చేసిన భట్టి ప్యూహాలు:

*గత 24 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన భట్టి ప్యూహాలు:*

జార్ఖండ్ రాజకీయాల్లో 24 ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయానికి భట్టి వేసే ఫ్యూహాలు ముగింపు పలికినట్లు కనిపిస్తున్నాయి.

 ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే జార్ఖండ్ ప్రజల తీర్పు, ఈసారి భట్టి అమలు చేసిన వ్యూహాల వల్ల మార్పు చెందుతోంది.

భట్టి నేతృత్వంలో, తెలంగాణలో అమలు చేసిన పథకాలను జార్ఖండ్ ప్రజలకు వివరించి, ఎన్నికల్లో కీలక మలుపు తిప్పగలిగారు. అంతేకాకుండా, ఆ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తామనే హామీతో ప్రజలను ఆకర్షించారు.

 *బీజేపీకి వ్యతిరేకంగా పటిష్ఠ వ్యూహం:* 

భట్టి పటిష్ఠ వ్యూహాలు బీజేపీ చేస్తున్న రాజకీయాలకు చెక్ పెట్టేలా ఉన్నాయి. ఇండియా కూటమి అభ్యర్థులకు సూచనలు చేస్తూ, ప్రచారంలో ముందుకు సాగుతూ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించారు.

*కౌంటింగ్ ట్రెండ్స్:* 

కేంద్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం, మొత్తం 81 అసెంబ్లీ స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ 41 కాగా, ఇండియా కూటమి 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మరోవైపు, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 29 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది. ఈ ట్రెండ్స్‌ను చూస్తే, జార్ఖండ్‌లో మళ్లీ కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు స్పష్టమైన మెజారిటీ కొనసాగుతుంది.

 *నూతన చరిత్ర సృష్టి:* 

ఈ ఫలితాలు భట్టి వ్యూహాలకు చారిత్రాత్మక విజయాన్ని చాటుతున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం ద్వారా జార్ఖండ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని తెరవబోతున్నారు.

 

 

Join WhatsApp

Join Now