తెలంగాణలో వరదలు జాతీయ విపత్తుగా ప్రకటించాలి: అమిత్ షాను కోరిన భట్టి, తుమ్మల
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఇటీవల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షాలు, పంట నష్టం గురించి అమిత్ షాకు వివరించారు.
ఆగస్టు 25-28 మధ్యలో కురిసిన వర్షాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. తక్షణ, అత్యవసర మరమ్మతులకు నిధులు ఇవ్వాలని కోరారు. పంటలు, ప్రజల ఆస్తులు, రహదారులు, చెరువులకు జరిగిన నష్టంపై వివరణ ఇచ్చారు. దాదాపు రూ.5,018 కోట్ల విలువైన నష్టం జరిగిందని, రాష్ట్రానికి విపత్తు నిధులు మంజూరు చేయాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. గతేడాది సెప్టెంబర్‌లో వరదల వల్ల రూ.11,713 కోట్ల నష్టం జరిగితే.. రూ.416.80 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. కేంద్రం మరిన్ని విపత్తు నిధులు ఇచ్చి రాష్ట్రాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు….