Site icon PRASHNA AYUDHAM

ఇందిరా గాంధీ పై నెగెటివ్ గా సినిమాలు తీసే వారికి బట్టి కౌంటర్..

గాంధీ
Headlines in Telugu:
  1. భట్టి విక్రమార్క: చరిత్ర వక్రీకరణకు కౌంటర్, ఇందిరా గాంధీని విమర్శించే వారిపై ప్ర‌తిపాదనలు
  2. ఇందిరా గాంధీ దేశ సమగ్రత కోసం ప్రాణం అర్పించిన నిజాలు గుర్తు చేసిన భట్టి విక్రమార్క
  3. భట్టి విక్రమార్క చరిత్ర వక్రీకరణపై తీవ్ర విమర్శ, ఈ దేశంలో మహిళలకు అందిస్తున్న ప్రత్యేక అవకాశాలు
  4. ఇందిరా గాంధీ దేశ సమైక్యత కోసం చేసిన శ్రేష్ఠ కృషి – భట్టి విక్రమార్క స్పీచ్
  5. భట్టి విక్రమార్క: కుల గణన సర్వే ద్వారా సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ పథకం

దేశ సమగ్రత పై అవగాహన లేని వారు ,గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్ర ను వక్రీకరిస్తున్నారు..

గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీ కి చేతులు ఎత్తి నమస్కరిస్తారు..

దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీ పై విమర్శలు చేస్తున్నారు..

ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీ ని నెగిటివ్ గా చూపిస్తున్నారు

గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ పాయింట్స్

భారతదేశాన్ని అస్థిరపరచాలి, దేశాన్ని విభాజించాలి అనుకునేవాళ్లు దివంగత ప్రధాని ఇందిరాగాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారు 

దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఇందిరా గాంధీ జీవిత చరిత్ర గురించి అవగాహన కలిగిన వాళ్ళు చేతులెత్తి ఇందిరాగాంధీని నమస్కరిస్తారు.

దేశ ప్రజలందరికీ సమానత్వం కల్పించాలని

భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల అమలుతో సమ సమాజానికి పునాదులు వేసిన ప్రధాని ఇందిరాగాంధీ

విదేశీ విధానంలో ఔనత్యాన్ని తీసుకువచ్చి ప్రపంచంలో భారత దేశాన్ని గొప్ప దేశంగా నిలబెట్టిన ప్రధాని ఇందిరాగాంధీ 

దేశం కోసం జాతి కోసం నిత్యం పరితపించిన ప్రజా నాయకురాలు ఇందిరాగాంధీ 

దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల సమూహాలను అనేక వర్గాల ప్రజలను కలిసికట్టుగా ఉంచి జాతిని ఏకతాటిపై నడిపిన ధీరోదాత్త ఇందిరాగాంధీ  

నా ప్రాణం కంటే కూడా ఈ దేశం ముఖ్యం. ఈ దేశ సుస్థిరత కోసం నా చివరి రక్తపు బొట్టు ఉపయోగపడుతుందని చాటి చెప్పిన ఉక్కు మహిళ ఇందిరాగాంధీ

ఇందిరా గాంధీ భారత దేశంలో పుట్టడం దేశ ప్రజలందరికీ గర్వకారణం 

అనేక సంస్థలు తీసుకువచ్చి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన ఇందిరా గాంధీ మార్గాన్ని ప్రజా ప్రభుత్వం అనుసరిస్తున్నది 

ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అభివృద్ధిలో అందరికీ సమానమైన అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల ముందు చెప్పాం. ఈ ఏడాది కాలంలో చేసి చూపిస్తున్నాం 

ఇందిరాగాంధీ స్ఫూర్తితోనే రాహుల్ గాంధీ ఈ దేశంలో కులగణన సర్వే జరగాలని ఎన్నికల్లో చెప్పిన విధంగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే అసెంబ్లీలో తీర్మానం చేసి కుల గణన సర్వేను ప్రారంభించాం 

రాష్ట్రంలో కులగణన నిబద్ధతతో, శాస్త్రీయంగా జరుగుతున్నది. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం తయారు చేసే ప్రణాళికలకు ఈ సర్వే దోహదపడుతుంది.

కుల గణన సర్వే పూర్తి తర్వాత ప్రజా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో దేశానికి ఈరాష్ట్రం రోల్ మోడల్ గా ఉండబోతుంది 

ఇందిరమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం మహిళలను మహాలక్ష్మిలుగా గౌరవిస్తుంది. అసెంబ్లీలో ప్రమాణం చేసిన గంటలోపే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించాం 

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించే రవాణా డబ్బులను ప్రభుత్వం మహిళల తరఫున నెలకు 400 కోట్ల రూపాయలు ఆర్టీసీకి చెల్లిస్తున్నది 

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏడాదికి 20వేల కోట్ల రూపాయల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తున్నాం 

వడ్డీ లేని రుణాలతో మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రజా ప్రభుత్వం తీర్చిదిద్దునుంది 

ఇందిరాగాంధీ ఆలోచనలను ప్రజా ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది 

దేశ చరిత్రపై అవగాహన లేని వాళ్ళు కావాలని సినిమాలు చేస్తున్నారన్న భట్టి విక్రమార్క

ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్న భట్టి

దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నవాళ్లు ఇందిరా గాంధీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*

ప్రపంచ స్థాయి లో భారత్ నిలబడడం లో ఇంధిరా గాంధీ పాత్ర కీలకం.

దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచింది.

మహిళలకు ఆర్టీసీ లో ఉచిత రవాణా కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం..

ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం..

Exit mobile version