*కష్టపడి ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టే.. గ్రామ ప్రజల, రైతన్నల మరియు రైతు కూలీల కష్టాలు తెలుసుకోగలుగుతున్న భట్టి విక్రమార్క
వల్లభి, గండ్రాయి, జగ్గయ్యపేట, తిరుమలగిరి మరియు నేలకొండపల్లి,కోదాడ కు ప్రత్యామ్నాయ దారి సిద్ధం..!
ఇకపై కొనిజర్ల,చింతకాని మండల గ్రామాల ప్రజలు తిరుమలగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్న, లేదా వల్లభి, జగ్గయ్యపేట, గండ్రాయి మరియు నేల కొండపల్లి , కోదాడ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రత్యామ్నాయ దారి సిద్ధం.
1.మత్కేపల్లి గ్రామం-వల్లపురం-గంధసిరి-పెద్ద మండవ-మల్కాపురం-గండ్రాయి-జగ్గయ్యపేట.
2.గంధసిరి-బాణాపురం-వల్లబి.
3.గంధసిరి-బాణాపురం-నాచుపల్లి-నేలకొండపల్లి-కోదాడ.
ప్రతి గ్రామానికి నుండి మరో గ్రామానికి లింక్ రోడ్డు ఉండాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సుమారు 400 కోట్ల రూపాయలతో మధిర నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన భట్టి విక్రమార్క
మరో 3 లేదా 4 నెలలో అన్ని గ్రామాలలో చేపట్టిన బీటీ రోడ్ల నిర్మాణం పూర్తవుతాయి.
ప్రతి గ్రామంలో ఈ రోడ్ల నిర్మాణం వలన గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు అని చెప్పుకోవచ్చు.
ఈ బీటీ రోడ్ల నిర్మాణం వలన పలు గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం కావడంతో పాటు, రైతులకు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు మేలు కలుగుతోంది.
ఈ బీడీ రోడ్ల నిర్మాణం పట్ల మధిర నియోజకవర్గ ప్రజలు మరియు రైతులు మరియు గ్రామల కాంగ్రెస్ పార్టీ నాయకులు *తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు.