కామారెడ్డిలో భిక్నూర్‌ గ్రామం “మోడల్‌ సోలార్‌ విలేజ్‌”గా ఎంపిక

కామారెడ్డిలో భిక్నూర్‌ గ్రామం “మోడల్‌ సోలార్‌ విలేజ్‌”గా ఎంపిక

పీఎం సూర్యఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజనలో భాగంగా కలెక్టర్‌ ప్రకటింపు

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) నవంబర్‌ 1

 

పీఎం సూర్యఘర్‌ ముఫ్తీ బిజిలీ యోజనలో భాగంగా కామారెడ్డి జిల్లాలో భిక్నూర్‌ గ్రామం “మోడల్‌ సోలార్‌ విలేజ్‌”గా ఎంపికైనట్లు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ తెలిపారు. ఈ పథకం లక్ష్యం ప్రతి జిల్లాలో ఒక మోడల్‌ సోలార్‌ గ్రామాన్ని అభివృద్ధి చేయడమేనని ఆయన చెప్పారు. తాజా జనాభా లెక్కల ప్రకారం 5,000 మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలే అర్హత పొందగా, కామారెడ్డి జిల్లాలో 18 గ్రామాలు పోటీలో నిలిచాయని పేర్కొన్నారు.

పోటీ కాలం పూర్తయ్యాక అత్యధిక సౌర శక్తి వినియోగం కలిగిన భిక్నూర్‌ గ్రామం ఎంపికైనట్లు తెలిపారు. ఈ పథకం కింద అన్ని రకాల ప్రభుత్వ భవనాల్లో ఉచిత సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయని, సోలార్‌ గ్రామ మార్గదర్శకాల ప్రకారం వివరమైన ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేయాలని సౌరశక్తి అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

ఆమోదం పొందిన డిపిఆర్‌ ప్రకారం ప్రాజెక్టులు నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, జిల్లా స్థాయి కమిటీ క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment