సంగారెడ్డి/వట్‌పల్లి, నవంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద, మంత్రి దామోదర్ రాజనర్సింహ సహకారంతో వట్‌పల్లి మండలం కేరూర్ గ్రామానికి 20 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించారు. ఇళ్ల నిర్మాణ పనులకు గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు కలిసి భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వట్‌పల్లి మండల యువ నాయకులు పెద్దపట్ల వినయ్ గౌడ్, కార్తీక్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, హౌసింగ్ ఏఈ, పంచాయితీ సెక్రటరీ వంశీ, కాంగ్రెస్ నాయకులు కుమార్, ప్రభాకర్ గౌడ్, సురేశ్, మల్లేశం, జెన్నయ్య, ఉషయ్య, అడివయ్య తదితరులు పాల్గొన్నారు.
కేరూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనులకు భూమి పూజ
Published On: November 17, 2025 8:26 pm