సంగారెడ్డి/సదాశివపేట, ఆగస్టు 8 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలం నందికంది గ్రామంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి, సీడీసీ చైర్మన్ గడీల రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్దన్న సహకారంతో కాంగ్రెస్ యువ నాయకుడు డి.చింటూగౌడ్ ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేశారు. శుక్రవారం గ్రామంలో లబ్ధిదారులు అబ్బిస సత్యమ్మ, వెల్తూర్ పద్మమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ వీరన్న, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు ఎం.శ్రీనివాస్, ఎం. వరప్రసాద్, సంజీవరావు, యవన్, విష్ణు, దిలీప్, వెల్తూర్ రమేష్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
నందికంది గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
Oplus_0