సంగారెడ్డి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట మండలం నందికంది గ్రామంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, సీడీసీ చైర్మన్ గడిల రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిద్ధన్న సహకారంతో కాంగ్రెస్ నాయకుడు డి.చింటూగౌడ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ గృహాలకు భూమి పూజ చేశారు. శుక్రవారం గ్రామంలో వడ్ల కళావతి ఇంటి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ రేష్మా, సెక్రటరీ వీరయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్. వరప్రసాద్, యవన్, దుర్గాబాయి, అనిల్, జనార్ధన్,. దిలీప్, సురేష్, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
నందికంది గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ
Oplus_0