Site icon PRASHNA AYUDHAM

భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు

IMG 20250613 WA2351

*భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు*

*మండల తహసిల్దార్ నల్ల వెంకట్ రెడ్డి, పి .రాణి*

*జమ్మికుంట /ఇల్లందకుంట జూన్ 13 ప్రశ్న ఆయుధం*

భూ సమస్యల పరిష్కారానికే అన్ని రెవెన్యూ గ్రామాల్లో భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జమ్మికుంట ఇల్లందకుంట మండలాల తాసిల్దార్లు నల్ల వెంకటరెడ్డి పి రాణి పేర్కొన్నారు జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో గురువారం భూభారతి రెవెన్యూ సదస్సులను నిర్వహించారు. మండల తహసిల్దార్లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టం రూపొందించారని భూభారతి రెవెన్యూ చట్టం తో ప్రతి రెవెన్యూ గ్రామంలో రైతు సదస్సులు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తాసిల్దార్లు తెలిపారు. జమ్మికుంట మండలంలోని సైదాబాద్ గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు గ్రామంలోని రైతులు వారి సమస్యలపై 139 దరఖాస్తులను ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో రెవిన్యూ సదస్సులో రైతులు భూ సమస్యలపై105 దరఖాస్తులను రెవెన్యూ అధికారులకు అందించారు రైతు భూ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిందని దీనిపై ప్రజలకు గతంలోనే అవగాహన కల్పించడం జరిగిందని ఇప్పుడు ప్రతి రెవెన్యూ గ్రామంలో జరగబోయే భూభారతి సదస్సుకు ముందు రోజే మా సిబ్బంది ఆ గ్రామంలో ఉన్న రైతులకు అవగాహన కల్పించి వారికి అప్లికేషన్లు అందించడం జరుగుతుందని రైతు సమస్యలను అప్లికేషన్ ద్వారా సదస్సులో అందిస్తే సరిపోతుందని తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో సదస్సులు నిర్వహించడం రైతులు సహకరించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాసిల్దార్లు వెంకట్ రెడ్డి రాణి డిప్యూటీ తాసిల్దార్లు శ్రీనివాస్ మన్విత్ సింగ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు గడ్డం శంకర్, సత్యనారాయణ, నాగరాజు ఎంపిఎస్ఓ రెవిన్యూ సిబ్బంది సర్వేయర్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version