ప్రశ్న ఆయుధం న్యూస్ జనవరి 15 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నూతన యాగశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. భగలాముఖి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 30 లక్షలతో నూతన యాగశాల, శ్రీ శారదాంబ మాత విగ్రహ ప్రతిష్ఠకు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సి సి రోడ్డు నిర్మాణానికి పూజలు నిర్వహించారు
ఈ కార్యక్రమంలో శివ్వంపేట గ్రామ పురోహితులు శాస్త్రులపురుషోత్తమ శర్మ, ముసునూరి రమ్యాఅయ్యప్ప దంపతులు, స్థలదాత పబ్బ రమేశ్ గుప్త, తాజామాజీ జెడ్పిటిసి పబ్బ మహేశ్ గుప్త, తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ తాజా మాజీ ఉపసర్పంచ్ పద్మ వెంకటేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్ , శక్తిపీఠం కార్యనిర్హాహకులు, శ్రీసూర్యకుమార్ గౌడ్ ,శిల్పిశ్రీవాణీ బాలసుబ్రహ్మణ్యం, వార్డు సభ్యులు వంజరి కొండల్, కొవ్వూరి వెంకటేష్, బాసంపల్లి పోచ గౌడ్ మరియు గ్రామస్తులు బాసంపల్లి శ్రీనివాస్ గౌడ్, హరి శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.