డిగ్రీ కళాశాలలో ఆదర్శ కళాశాల వ్యవస్థాపకుని విగ్రహం భూమి పూజ

*డిగ్రీ కళాశాలలో ఆదర్శ కళాశాల వ్యవస్థాపకుడు నారాయణరెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ*

*జమ్మికుంట జనవరి 24 ప్రశ్న ఆయుధం*

జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ , పీజీ కళాశాల ఆవరణలో కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర మాజీ మంత్రి, ప్రభుత్వ (ఆదర్శ) కళాశాల వ్యవస్థాపకులు నారాయణ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ రామస్వామి మాట్లాడుతూ 1965 సంవత్సరంలో జమ్మికుంటలో కె.వి. నారాయణరెడ్డి ఆదర్శ కళాశాలను ఏర్పాటు చేశారని గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలనే గొప్ప లక్ష్యంతో ఆనాడు కళాశాలను ఏర్పాటు చేసిన నారాయణరెడ్డి సేవలను కొనియాడారు అనంతరం రాబోయే విద్యాసంవత్సరానికి డిగ్రీ అడ్మిషన్ల కొరకు రూపొందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. అదే విధంగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు వివిధ సాంస్కృతిక, క్రీడాపోటీల్లో గెలుపొందిన వారికి పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్యర్యంలో బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. రమేష్, కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు డా. పల్లూరి సంపత్ రావు, న్యాయవాది మొలుగూరి సదయ్య, డాక్టర్ రవి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now