నిత్య అన్నదాన మండపానికి భూమిపూజ…

శ్రీ హరి హర సూతన్ నిత్య అన్నదాన మండపానికి భూమిపూజ..

IMG 20241016 WA0084 scaled

ఖమ్మం : 31వ డివిజన్ పంపింగ్ వెల్ రోడ్ ప్రాంతంలో శ్రీ హరి హర సూతన్ నిత్య అన్నదాన మండపానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు . శ్రీ హరి హర సూతన్ నిత్య అన్నదాన సేవ సమితి ఆధ్వర్యంలో నవంబర్ 03 నుండి డిసెంబర్ 13 వరకు 41 రోజుల పాటు ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు అయ్యప్ప మాలధారులకు మరియు మిగతా స్వాములకు అన్న ప్రసాద వితరణ చేయనున్నట్లు ట్రస్టు చైర్మన్ వల్లెపు ఉపేందర్ ( లక్కీ ) స్వామి తెలిపారు . ఈ కార్యక్రమంలో వల్లెపు పిచ్చయ్య , వల్లెపు సైదులు , వల్లెపు వీరస్వామి , కుంచపు వెంకటేశ్వర్లు , రమేష్ , పవన్ , పప్పీ , ఉపేందర్ , యల్లయ్య మరియు స్వాములు తదితరులు పాల్గొన్నారు .

Join WhatsApp

Join Now