కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు: భూపాల్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన దీక్ష దివస్ కార్యక్రమానికి నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావుతో కలిసి పూలమాల వేశారు. మాజీ సీఎం కేసీఆర్ తోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యిందని తెలిపారు.