*దేవాయలనికి దగ్గర బెల్ట్ షాపులను తొలిగించాలి-భూపతి ప్రవీణ్*
•మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురైవుతున్న పట్టికంచుకొని వైనం
కమలాపూర్ (జనవరి 5)
కమలాపూర్ మండల పరధిలో భీంపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం కీ ఎదురుగా ఉన్న బెల్ట్ మద్యం షాప్ నీ తొలగించాలనీ డిమాండ్ చేస్తున్నాం.నిత్యం జనాలు సంచరించే ప్రాతం ముఖ్యంగా మహిళల లకు ఇబ్బందులు తలేత్తున్న నేపథ్యంలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటలకు వరకూ మందు బాబులతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.స్కూల్ కీ మరియు దేవాలయాలకు దగ్గర ఎలాంటి బెల్ట్ మద్యం షాప్ లు నిర్వహించకూడదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని పట్టించు కోకుండా డబ్బు సంపాదనే ద్యేయంగ విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ మద్యం షాప్ లను నిర్వహిస్తున్నారు.
అధికార పార్టీ అండదండలు, గత ప్రభుత్వ అండదండలు, కొంత మంది అధికారుల అండదండలతో నిర్వాహకులు చెలరేగిపోతున్నారు.
ఇప్పటికి అయినా ఉన్నత అధికారులు బెల్ట్ షాప్ పైన చర్య తీసుకొని హనుమాన్ దేవాలయం ప్రాంతం లో ఉన్న బెల్ట్ షాప్ నీ తొలగించవల్సింది గా అధికారులనూ భీంపల్లి గ్రామ ఆడపడుచుల పక్షాన ప్రజానీకం పక్షాన కోరుతున్నారు.