భువనగిరి తాజ్పూర్‌లో మృతుల కుటుంబాలకు పరామర్శ
ఆర్‌ఎస్కె ఫౌండేషన్ అధినేత డా. ర్యాకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమం
వరిగంటి ఈశ్వరయ్య, పల్లెపాటి రవి కుటుంబాలకు ఆర్థిక సహాయం
భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ
కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పాల్గొనడం
భువనగిరి (ప్రశ్న ఆయుధం), సెప్టెంబర్ 3:
భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో ఇటీవల మరణించిన వరిగంటి ఈశ్వరయ్య, పల్లెపాటి రవి కుటుంబాలను ఆర్‌ఎస్‌కె ఫౌండేషన్ అధినేత, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు డా. ర్యాకల శ్రీనివాస్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా డా. శ్రీనివాస్ మాట్లాడుతూ, “వారి కుటుంబాలకు భవిష్యత్తులో ఎప్పటికప్పుడు అండగా ఉంటాను” అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.