బీబీపేట్ రేషన్ బియ్యం పై ప్రజల్లో ఆగ్రహం..!
కామారెడ్డి జిల్లా – బీబీపేట్ మండలం
ప్రభుత్వం పేదల కోసం పంపిన రేషన్ బియ్యం నాణ్యతపై తీవ్ర ఆందోళన..!
బీబీపేట్ మండలంలో పాత, ముక్క బియ్యం పేదలకు పంపిణీ..!
రేషన్ దుకాణాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం..!
అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం..!
“పేదల కోసం ఇచ్చేది చెత్తలా ఎందుకు?” అని ప్రశ్నిస్తున్నప్రజలు..!
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్..!
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 15
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ప్రభుత్వ రేషన్ బియ్యం నాణ్యతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే పంపిన సరుకును రేషన్ దుకాణదారులు పాతదిగా, ముక్కలుగా ఉన్న బియ్యాన్ని పేదలకు పంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
“ప్రభుత్వం పేదల కోసం పంపిన బియ్యం తినదగ్గ స్థాయిలో లేదు. పిల్లలకు ఇచ్చేందుకు కూడా భయపడుతున్నాం,” అని స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజలు స్పష్టంగా చెబుతున్నారు — “ఇలా పాత బియ్యం ఇవ్వడం అనేది పేదల అవమానం.” అధికారులు ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి, నాణ్యతలేని బియ్యం పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల ప్రశ్న ఒకటే — “పేదల జోలికి వచ్చే ఈ నిర్లక్ష్యం ఎప్పుడు ఆగుతుంది..?”