Site icon PRASHNA AYUDHAM

కన్నప్ప లో బిగ్ బాస్ కౌశల్ నటన పై ప్రశంసలు

IMG 20250628 WA0451

*కన్నప్ప లో బిగ్ బాస్ కౌశల్ నటన పై ప్రశంసలు*

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కన్నప్ప సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. మంచు విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్, డార్లింగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అక్షయ్ కుమార్, కాజల్ మొదలగు వారు నటించిన పాన్ ఇండియా సినిమాలో బాపట్ల అల్లుడు అయ్యిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కూడా మంచి పాత్ర పోషించారు. ఈ సినిమాలో కౌశల్ మాలి అనే పాత్రలో ఇమిడిపోయారు. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించటం పట్ల కౌశల్ ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరించనున్నట్లు ఆయన తెలిపారు. న్యూజిలాండ్ లో ఎక్కువ భాగం షూటింగ్ చేశామని, మైనస్ డిగ్రీల చలిలో కూడా ఎంతో భక్తితో షూటింగ్ చేసినట్లు ఆయన వివరించారు.

Exit mobile version