*కొమురం భీం జిల్లాలో మహిళపై పెద్ద పులి దాడి*
కొమురం భీం జిల్లా:నవంబర్ 29
ఆసిఫాబాద్ జిల్లాలో ఈరోజు ఉదయం ఓ మహిళపై పులి దాడి చేసింది, కాగజ్ నగర్ మండలంలోని ఇస్ గాం గ్రామంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది,
గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మి(21) తన చేనులో పత్తి ఏళ్లడానికి వెళ్ళింది,అకస్మాత్తుగా ఆమెపై పులి దాడి చేసింది,దీంతో మోర్లే లక్ష్మి తీవ్రంగా గాయపడింది, చికిత్స కోసం దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కాగజ్నగర్ డివిజన్ అటవీ శాఖ కార్యాలయం ముందు లక్ష్మీ మృతదేహాన్ని ఉంచిగ్రామస్తులు ధర్నాకు దిగారు. లక్ష్మి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా పెద్దపులి సంచారం నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
ఒంటరిగా ఎవరూ అడవి లోకి వెళ్లొద్దని, సాయంత్రం త్వరగా ఇండ్లకు చేరుకోవా లని సూచించారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానిక ప్రజలు భయాం దోళనకు గురవుతున్నారు.
పెద్దపులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి పులిని బంధిం చాలని కోరుతున్నారు.