జగిత్యాల జిల్లాలో పెద్దపులి కలకలం

*జగిత్యాల జిల్లాలో పెద్దపులి కలకలం*

జగిత్యాల జిల్లా: డిసెంబర్ 30

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుత పులి కలకలం రేపుతుంది. ఓ ఫామ్ హౌస్ దగ్గర కుక్క చనిపోయి ఉంది, ఏదో జంతువు పీక్కుతిన్నట్లు ఆదివారం సాయంత్రం గ్రామస్తులు గమనించారు.

స్థానికుల కథనం ప్రకారం మెట్ పల్లి మండలం రంగా రావుపేట గ్రామ శివారులో ఆదివారం చిరుత సంచ రించి ఓ శునకం పై దాడికి పాల్పడినట్లు చిరుతపులి ఆనవాళ్లు కనిపించాయని, గ్రామస్తులు తెలిపారు..

ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్ట్ అధికారులు హుటా హుటిన సంఘటనా స్థలా నికి చేరుకుని గాయపడిన శునకాన్ని పరిశీలించారు.

సమీపంలో చిరుత కాలి ముద్రలు కనబడడంతో దాన్ని సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపనున్నట్లు తెలిపారు. కాలి ముద్రలను బట్టి చూస్తే కచ్చితంగా చిరు త పులి సంచరిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో ఫారెస్ట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టా రు. గ్రామ ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now