Site icon PRASHNA AYUDHAM

ప్రాదేశిక ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. బ్యాలెట్ పేపర్ల కలర్ ఫిక్స్..!!

IMG 20250722 WA0215

*_ప్రాదేశిక ఎన్నికలపై బిగ్ అప్‌డేట్.. బ్యాలెట్ పేపర్ల కలర్ ఫిక్స్..!!_*

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలో త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్స్‌కు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు స్పీడప్ పెంచారు.

ఈ క్రమంలో బ్యాలెట్ పేపర్ల కలర్లను ఫైనల్ చేశారు. ఎంపీటీసీకి గులాబీ, జెడ్పీటీసీకి తెలుపు రంగు బ్యాలెట్వినియోగించనున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్సిబ్బందిని నియమిస్తున్నారు. పోలింగ్, బ్యాలెట్పేపర్, బ్యాలెట్బాక్సులు, స్టేషనరీ తదితర వాటన్నింటినీ మరోసారి సరిచూసుకొని సిద్ధంగా ఉండాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

*_400 మందికి ప్రిసైడింగ్ అధికారి_*

ఒక పోలింగ్కేంద్రంలో 400 మంది వరకూ ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్అధికారి, నలుగురు పోలింగ్అధికారులను నియమించనున్నారు. 400 నుంచి 600 వరకూ ఓటర్లు ఉంటే ఒక ప్రిసైడింగ్ఆఫీసర్, ఐదుగురు పోలింగ్అధికారులను నియమిస్తారు. ఓటు వేసేటప్పుడు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా వేస్తారు. బాణం క్రాస్మార్క్రబ్బరు స్టాంపుతో ఓటు వేస్తారు. మొదట ఎంపీటీసీకి ఓటు వేసిన తర్వాత జెడ్పీటీసీ బ్యాలెట్పేపర్ఇస్తారు. ఒకే సారి రెండు బ్యాలెట్పేపర్లు ఇవ్వరు. ఓటు ఎవరికీ కనిపించకుండా వేయాల్సి ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చూపించి వేస్తామంటే నిబంధనలు అంగీకరించవు. ప్రతి బ్యాలెట్పేపర్ వెనకాల ప్రిసైడింగ్అధికారి తప్పకుండా సంతకం చేయాల్సి ఉంటుంది. ప్రతి బ్యాలెట్ పేపర్ వెనుక ప్రత్యేక గుర్తు ఒక వలయంలో భిన్నంగా ఉంటుంది. ఇందులో గణితంలో భాగాహరం విధానంలో పైన మండల ప్రజా పరిషత్కోడ్, కింద జిల్లా ఎన్నికల అధికారి ఆమోదించిన పోలింగ్స్టేషన్ నంబర్ ఉంటుంది.

*_ముగ్గురు ఎంపీటీసీలకు ఒక రిటర్నింగ్ అధికారి_*

మూడు అంత కంటే ఎక్కువ కానీ తక్కువ ఉన్న ఎంపీటీసీలకు ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ఒక గెజిటెడ్అధికారిని రిటర్నింగ్ఆఫీసర్‌గా నియమిస్తారు. జెడ్పీటీసీకి మరో రిటర్నింగ్అధికారిని నియమిస్తారు. ఎంపీటీసీ స్థానాల రిటర్నింగ్అధికారులందరూ జెడ్పీటీసీ రిటర్నింగ్అధికారికి సహాయ రిటర్నింగ్ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. 2018 తెలంగాణ పంచాయతీరాజ్చట్టం 243(3) ప్రకారం ఏ అభ్యర్థి కూడా ఒక మండల ప్రజాపరిషత్లేదా జిల్లా ప్రజా పరిషత్‌లోని ఒకటి కంటే ఎక్కువ ప్రాదేశిక నియోజకవర్గాలకు పోటీ చేయొద్దని స్పష్టం చేస్తోంది. ప్రతి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్వేసేందుకు కనీసం ఒక రోజు ముందుగా ఎన్నికల వ్యయం కోసం ప్రత్యేకంగా బ్యాంకులో ఖాతా తెరిచి, ఖాతా నంబర్నామినేషన్వేసే సమయంలో ఆర్‌వోకు రాత పూర్వకంగా ఇవ్వాలి. ఎన్నికల వ్యయం మొత్తం ఈ ఖాతా ద్వారా మాత్రమే చేయాలి. అభ్యర్థి సొంత నిధులతో సహా ఇతర మార్గాల ద్వారా వచ్చిన డబ్బును సైతం ఈ ఖాతాలో జమ చేసి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.

*_పోటీ చేయాలంటే 21 ఏళ్లు నిండాల్సిందే.._*

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్‌కు పోటీ చేసే వారు ఖచ్చితంగా 21 ఏండ్లు నిండి ఉండాలి. ఏదైన గ్రామ సేవలకు కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థల అధికారి, ఉద్యోగి, ప్రభుత్వ నిధుల నుంచి సహాయం పొందుతున్న ఏదేని సంస్థలోని ఉద్యోగి, శాసనసభ లేదా పార్లమెంట్ఉభయ సభలు చేసిన చట్టం కింద ఏర్పాటైన ఏదైనా సంస్థ కార్యనిర్వహక సభ్యుడు, ఉద్యోగి, వీరిలో ఎవరు కూడా స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్న వారు సైతం ఈ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్చట్టంలో మార్పు తీసుకొచ్చింది. ఈ సారి నోటా గుర్తు సైతం బ్యాలెట్పేపర్‌లో ఉండనుంది.

Exit mobile version