బీజాపూర్ ఎన్‌కౌంటర్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
Jul 27, 2025,
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో శనివారం భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరణించిన మావోయిస్టుల మృతదేహాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి ఐఎన్ఎస్ఏఎస్ అస్సాల్ట్ రైఫిల్, సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. పరిసర ప్రాంతాల్లో భద్రతా దళాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి.