బిజిలిపూర్ దుర్గమ్మ గుడికి దారి సమస్య పరిష్కారం..

బిజిలిపూర్ దుర్గమ్మ గుడికి దారి సమస్య పరిష్కారం..
◆అధికారుల చొరవతో పరిష్కారమైన భూసమస్య….
◆తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దారికి హద్దులు ఏర్పాటు..
◆సంతోషం వ్యక్తం చేసిన బిజిలిపూర్ గ్రామస్తులు..

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 24(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని బిజిలిపూర్ గ్రామంలో గత 15 రోజులుగా నెలకొన్న దుర్గమ్మ గుడి భూసమస్య మండల అధికారుల చొరవతో బుధవారం పరిష్కారం అయింది. గ్రామంంలోని దుర్గమ్మ గుడికి వెళ్లేందుకు ఉన్న దారి తమ భూమిలోంచి ఉందని కొందరు అడ్డుపడటంతో వివాదం చెలరేగింది. ఇదే విషయమై గత వారం రోజుల క్రితం గ్రామస్తులు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టగా బుధవారం తమ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లిన తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్ఐ మహిపాల్ రెడ్డి ఇరు వర్గాలతో మాట్లాడి గ్రామస్తులందరి సమక్షంలో దుర్గమ్మ గుడి దారి వివాదాన్ని పరిష్కారం చేశారు.
దుర్గమ్మ దేవాలయ దారి వివాదాన్ని పరిష్కరించేందుకు తహసీల్దార్ శ్రీనివాస్ చారి, ఎస్ఐ మహిపాల్ రెడ్డి గ్రామానికి వచ్చి సర్వేనెంబర్ 268/అ, 268/ఆ గురించి తాజామాజీ ఉపసర్పంచ్ షేక్ జహంగీర్, షేక్ చాంద్,గ్రామ పెద్దలు చిట్యాల పోచయ్య, కమ్మరి కృష్ణ,కుక్కల ముత్యాలు, కమ్మరి రవీందర్, శామీర్ పేట ఆంజనేయులు, బ్రాహ్మచారి, కుక్కల నవీన్ ఖాజాపాషా, మరికొంత మంది గ్రామస్తులతో దారి విషయం చర్చించడం జరిగినది.ఇరువర్గాల ఒప్పందం మేరకు దుర్గమ్మ గుడికి మెయిన్ రోడ్డు నుండి 30 ఫీట్ల రోడ్డు, గుడి వెనకాల 20 ఫీట్ల స్థలాన్ని విడిచి పెట్టాలని అధికారుల ముందు ఒప్పుకొని వెంటనే హద్దులు కూడ ఏర్పాటు చేసుకోవడంతో సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now