రోడ్డు భద్రతపై మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
మోపాల్, (ప్రశ్న ఆయుధం) జనవరి 4
రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఆదివారం మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ మోపాల్ గ్రామం నుంచి మంచిప్ప గ్రామం వరకు సాగింది. అనంతరం నర్సింగ్‌పల్లి గ్రామంలో పోలీస్ అధికారులు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా మోపాల్ ఎస్సై సుస్మిత మాట్లాడుతూ మద్యం తాగి వాహనం నడపకూడదని హెచ్చరించారు. మద్యం తాగి వాహనం నడిపితే మొదటిసారికి రూ.10,000, రెండోసారి రూ.15,000 జరిమానా విధిస్తామని తెలిపారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు అప్పగించవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు నష్టపోకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు.
ఈ హెల్మెట్ బైక్ ర్యాలీలో మోపాల్ మండల ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.