పోలీస్ స్టేషన్ నుండి ఎత్తుకెళ్లిన బైక్ మహారాష్ట్రలో లభ్యం చోరీకి పాల్పడింది ఎవరనే విషయంపై పోలీస్ ల ఆరా.

పోలీస్ స్టేషన్ నుండి ఎత్తుకెళ్లిన బైక్ మహారాష్ట్రలో లభ్యం చోరీకి పాల్పడింది ఎవరనే విషయంపై పోలీస్ ల ఆరా.

నిజామాబాద్ (ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి జనవరి 02

ట్రాఫిక్ పోలీసు స్టేషన్ నుండి చోరీకి గురైన ద్విచక్ర వాహనం మహారాష్ట్ర లభ్యమైoది. గత వారం రోజుల క్రితం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి వాహనం చోరీకి గురి కావడం చర్చనీయాంశంగా మారింది.

నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి ద్విచక్ర వాహనంచోరీకి గురి కావడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. . తీర్మ న్ పల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వారం రోజుల క్రితం జిల్లా కేంద్రానికి వచ్చాడు. ట్రాఫిక్ పోలీసుల వాహనాల తనిఖీలో భాగంగా త్రీబుల్ రైడ్ తో వెళ్తున్న నాగరాజును పోలీసులు పట్టుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని బైక్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్లో స్థలం లేకపోవడంతో స్టేషన్ బయట వాహనాన్ని పార్క్ చేశారు. మరుసటి రోజు వాహనదారుడు చాలాన్ చెల్లించి వాహనం తీసుకెళ్లేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. తన బైక్ కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఇదే విషయాన్ని ట్రాఫిక్ పోలీసులకు అడగడంతో వారు సరైన సమాధానం చెప్పలేదు. తన బైకు చోరీకి గురిందని భావించి వెంటనే సంబంధిత వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు చోరీకి గురైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చోరీ జరిగిన వాహనం మహారాష్ట్రలో ఉన్నట్టు గుర్తించి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో బైక్ దొంగతనం జరగడం చర్చకు దారి తీసింది. వాహనాన్ని చోరీచేసిన దొంగలు ఎవరనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. వాహన చోరీ కేసులో ఓ కానిస్టేబుల్,, ఓ విలేఖరి ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారి పేర్లు వెల్లడించేందుకు పోలీస్ అధికారులు నిరాకరించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల రక్షణ వలయంగా నిలిచిన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుండి తనిఖీలో పట్టుకున్న వాహనం చోరీకి గురికావడం జరిగే పని కాదని తెలుస్తుంది. దీని వెనుక బలమైన వారే ఉండడం వల్లే వివాహనం చోరీకి గురైనట్లు సమాచారం.

Join WhatsApp

Join Now