Site icon PRASHNA AYUDHAM

రాత్రి నాకాబందిలో దొరికిన బైక్ దొంగ… వాహనం రికవరీ

IMG 20250810 WA0266

రాత్రి నాకాబందిలో దొరికిన బైక్ దొంగ… వాహనం రికవరీ

ప్రత్యేక పోస్టు వద్ద సదాశివనగర్ పోలీసుల పట్టివేత

కామారెడ్డి నుంచి దొంగిలించిన బైక్ స్వాధీనం

నిందితుడు కస్టడీలో – సంబంధిత పోలీసులకు అప్పగింత

రాత్రంతా అప్రమత్తంగా నాకాబందిలో విధులు

చురుకైన కానిస్టేబుల్స్‌కు ఎస్ఐ పుష్పరాజ్ అభినందనలు

కామారెడ్డి జిల్లాసదాశివనగర్, (ప్రశ్న ఆయుధం)ఆగస్టు 10

సదాశివనగర్ పోలీసులు రాత్రి నాకాబందిలో బైక్ దొంగను పట్టుకున్నారు. నిన్న రాత్రి 3.30 నుంచి 4 గంటల మధ్య ప్రత్యేక పోస్టు వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్స్ అజార్ శ్రీకాంత్, తాడ్వాయి కానిస్టేబుల్ ఇర్ఫాన్ అనుమానాస్పదంగా వెళ్తున్న వ్యక్తిని ఆపి వాహన తనిఖీ చేశారు.

తదుపరి పోలీస్ స్టేషన్‌లో విచారణ జరిపగా, అతడు కామారెడ్డి పట్టణం నుంచి బైక్ దొంగిలించినట్టు వెల్లడైంది. వెంటనే బైక్‌ను స్వాధీనం చేసుకుని యజమానులకు సమాచారం అందించారు. ఈ కేసు కామారెడ్డి స్టేషన్ పరిధిలోనే నమోదై ఉండటంతో, నిందితుడిని అక్కడి పోలీసులకు అప్పగించారు.

దొంగతనాల నివారణకు నాకాబంది, వెహికిల్ చెకింగ్, పెట్రోలింగ్‌ను కట్టుదిట్టం చేసిన సిబ్బంది, ముఖ్యంగా అజార్ శ్రీకాంత్, ఇర్ఫాన్‌లను ఎస్ఐ పుష్పరాజ్ అభినందించారు. “సిబ్బంది చురుకైన విధుల వల్లే దొంగతనం కేసు వెలుగులోకి వచ్చింది” అని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version