తక్షణమే   సర్పంచుల పెండింగ్ బిల్లులు  విడుదల కు బిల్లులు ప్రవేశపెట్టాలని”

మెదక్ జిల్లా  మాజీ ఎంపీపీల పోరం అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ….

ప్రశ్న ఆయుధం న్యూస్ ఆగస్టు 2(మెదక్ ప్రతినిధి  శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్ర మెదక్ జిల్లా మాజీ ఎంపీపీల పోరం అధ్యక్షుడు  కల్లూరి హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ గత మాజీ సర్పంచులు తమ తమ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి గ్రామాలను సుందరమయంగా  తీర్చిదిద్దడం  జరిగిందని వారికి ఉన్న పెండింగ్ బిల్లులు నేటి వరకు  వారికి చెల్లించలేకపోవడం  చాలా బాధాకరమని  నేడు తెలంగాణ అసెంబ్లీ చివరి రోజు కనుక ప్రభుత్వం నేటి సమావేశంలో పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఆపడం సరికాదని తక్షణమే బిల్లులు ప్రవేశపెట్టాలని  ప్రభుత్వాన్ని కోరడం జరిగిందని ఆయన తెలిపారు  ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు  తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now