బైండ్ల కులాన్ని వెనుకబడిన కులంగా గుర్తించాలి
జస్టిస్ షమీమ్ అక్తర్ ను కలసి వినతి పత్రాన్ని ఇస్తున్న బైండ్ల సంఘం ప్రతినిధులు
చిన్నకోడూర్ డిసెంబర్ 18 ప్రశ్న ఆయుధం :
సుప్రీం కోర్ట్ తీర్పు నేపథ్యంలో ఎస్సి వర్గీకరణ ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సందర్బంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ డా,,జస్టిస్ షమీమ్ అక్తర్ ను కలిసి బైండ్ల కులాన్ని సామాజికంగా, ఆర్ధికంగా, విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయంగా వెనుకబడిన కులంగా గుర్తించాలని సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మారపాక శివకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి గణేష్ , కార్యదర్శి బచ్చలి బాబు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కమిషన్ గారితో మాట్లాడుతూ 2011 జనాభా గణంకాల ప్రకారం కేవలం 19 వేల జనాభా మాత్రమే బైండ్ల కులాన్ని చూపించారని అవి తప్పుడు లెక్కలు గా పరిగణించి, ప్రస్తుతం జరుగుతున్న సర్వే ప్రకారం బైండ్ల జనాభాను పరిగణలోకి తీసుకొని సుమారు 6 లక్షల పైచిలుకు జనాభా కలిగిన బైండ్ల కులానికి న్యాయం చేయాలని అన్నారు. బైండ్ల పూజారులు గ్రామదేవతల పండుగలు చేసుకుంటూ జీవనం సాగిస్తారని తెలియజేస్తూ కమిషన్ ముందు జమిడిక వాయిద్యాలతో కళా ప్రదర్శన చేశారు. కమిషన్ ఆ కళా ప్రదర్శనను నిషితంగా పరిశీలించి వీడియో రికార్డు చేసుకొని ప్రభుత్వ నివేదికలో పొందుపరుస్తామన్నారు. ఏకసారుప్యత కలిగిన సమూహలైన గ్రామదేవతల పూజారులు, బైండ్ల, పంబాల, కొలుపుల, ద్యావతి, అసాదుల, పోతారాజులను ఎస్సి ఎ జాబితాలో చేర్చి 7% శాతం తగ్గకుండా రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ కు విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి భరత్ కుమార్, కోశాధికారి మిట్టపల్లి రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షులు వేముగంటి కుమారస్వామి, మిట్టపల్లి సుధాకర్, జిల్లా కార్యదర్శి వేముగంటి రాజు, మిట్టపల్లి ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్టపల్లి రాజు, మిట్టపల్లి పరశురాములు, మిట్టపల్లి కనకయ్య, మిట్టపల్లి వంశీ, వేముగంటి సాయికిరణ్, హుస్నాబాద్ మండల అధ్యక్షుడు వేముగంటి విజయ్, కార్యవర్గ సభ్యులు సాయి, రఘు తదితరులు పాల్గొన్నారు.