Headlines :
-
మాసబ్ ట్యాంక్ లో తెలంగాణ రాష్ట్ర జీవ శాస్త్ర ఉపాధ్యాయ సంఘం సమావేశం
-
సమావేశంలో కీలక తీర్మానాలు
-
33 జిల్లాల నుండి ఉపాధ్యాయులు సమావేశానికి హాజరుకావడం
మెదక్/నర్సాపూర్, నవంబరు 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ బాలికల గర్ల్స్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర జీవ శాస్త్ర ఉపాధ్యాయ సంఘం (టీబీఎస్ఎఫ్) రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు పెసర ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని 33 జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులు హాజరయ్యారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లా బయోసైన్స్ ఫోరమ్ జిల్లా అధ్యక్షుడు దొంతి. ప్రసన్న కుమార్, ప్రధాన కార్యదర్శి మెరుగు నరేందర్, కోశాధికారి సాతేల్లి రమణ, రాష్ట్ర బాధ్యులు జంగం మల్లేశం పాల్గొని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన రాష్ట్ర అధ్యక్షుడు పెసర ప్రభాకర్ రెడ్డి ను సన్మానించారు . ఈ సందర్భంగా కమిటీ పలు అంశాలు తీర్మానించారు.
1). పదవ తరగతి మెమోలో జీవశాస్త్రానికి సంభందించిన మార్కులను ప్రత్యేకంగా ఉండే విధంగా, ఆ దిశగా అధికారులకు వినతి పత్రం ఇవ్వాలని తీర్మానించారు.
2). పదవ తరగతి లో సైన్స్ లో విద్యార్థులు భౌతిక శాస్త్రం లో ఫెయిల్ అయితే కేవలం భౌతిక శాస్త్ర సబ్జెక్టు మాత్రమే రాసే విధంగా, జీవశాస్త్రంలో ఫెయిల్ అయితే కేవలం జీవశాస్త్రము మాత్రమే రాసే విధంగా ఉండాలి.
3). అర్హత గల స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు ప్రమోషన్ ఇవ్వాలి.
4). ఇటీవల కాలంలో ప్రమోషన్ పొందిన, నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నిపుణుల బృందం ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి.
5). పాఠశాలలో అన్ని తరగతులకు (6,7,8,9,10) ఒకే రీతిలో పరీక్ష పత్రము ఉండాలి.