బీర్కూర్ సహకార సంఘం ఇన్చార్జి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఇంగురాములు
బాన్సువాడ ఆర్సి( ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 16
కామారెడ్డి జిల్లా బీర్కూర్ ప్రాథమిక సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్గా ఇంగురాములు మంగళవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. డి సి ఓ రామ్మోహన్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీని, సహకార సంఘం కార్యదర్శి విట్టల్ ,ఇంగురాములకి అందజేసి, సహకార సంఘం బాధ్యతలు అప్పగించారు. నూతనంగా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇంగురాములకు, ప్రజాపతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సహకార సంఘం సిబ్బంది అభినందనలు తెలిపారు. సహకార సంఘం నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఇంగురాములు మాట్లాడుతూ,, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, సహకార సంఘం డైరెక్టర్లు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, రైతుల సహకారంతో బీర్కూర్ సహకార సంఘాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఉత్తమ సహకార సంఘం తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఇంగురాములు వెల్లడించారు. అనంతరం సహకార సంఘం కార్యదర్శి విటల్, నూతన చైర్మన్ ఇంగురాములకు శాలువా కప్పి సత్కరించారు.