బీర్కూర్ వైఎస్ఆర్ కాలనీ దయనీయ స్థితి
వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి అత్యంత దారుణం – రోడ్లు లేవు, మురికే మిగిలింది
వర్షాకాలంలో దోమలు, పందులు, దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది
గ్రామపంచాయతీకి వాసుల పలు సార్లు వినతులు – స్పందన మాత్రం మాటల్లోనే
దట్టమైన చెట్లు, పోదాలు, మురికి కాలువలు తొలగింపుపై చర్యలు లేవు
కాలనీవాసులు: “ఆరోగ్య సమస్యలు మాపై భారమవుతున్నాయి”
బాన్సువాడ ఆర్సీ, ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 15:
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీ పరిస్థితి కాలనీవాసులను దయనీయ స్థితిలోకి నెట్టింది. పలు సంవత్సరాలుగా గ్రామపంచాయతీ అధికారులకు విన్నవించినా పరిష్కారం కాని సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే కాలనీలో జీవనమే కష్టమైపోతుంది. మురికి కాలువలు ఉప్పొంగిపోతూ రోడ్లను మట్టిగుంటలుగా మారుస్తున్నాయి. చెత్తా, చెదారితో దుర్వాసన, దోమల ఉధృతి పెరిగిపోగా, పందుల సంచారం సాధారణమైపోయింది. రోడ్లు సరిగా లేకపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.
కాలనీలో దట్టమైన చెట్లు, పోదాలు తొలగించాలంటూ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు ‘చేస్తాం’ అని చెప్పడమే తప్ప పనిలోకి రాలేదు. “ఇలా ఉంటే రోగాలు వ్యాపించే ప్రమాదం ఎక్కువ” అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాలనీవాసుల వేదన:
“ఎన్ని సార్లు చెప్పినా స్పందన లేదు. ఇంత దుర్వాసనలో ఎలా బతకాలి? అధికారులు వచ్చి చూడాలి. రోడ్లు, పరిశుభ్రత పనులు వెంటనే పూర్తి చేస్తే మాకు ఊరట కలుగుతుంది” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.