Site icon PRASHNA AYUDHAM

వృద్ధాశ్రమంలో జన్మదిన వేడుకలు

IMG 20240724 WA1710

వృద్ధాశ్రమంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ఇల్లందకుంట ప్రశ్న ఆయుధం జూలై 24

మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను వృద్ధుల మధ్య బిఆర్ఎస్ నాయకుడు మేకల రవీందర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బిఆర్ఎస్ నాయకుడు రవీందర్ మాట్లాడుతూ పేదల పెన్నిది బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదినాన్ని పురస్కరించుని మండల కేంద్రంలోని వృద్ధాశ్రమములో కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేసి మొక్కలు నాటారు అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు బిజెపి కేంద్ర ప్రభుత్వంకు తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి తప్ప తెలంగాణ అభివృద్ధి అవసరం లేదన్నట్లుగా ఉందని పార్లమెంటు సమావేశాలలో కేంద్రం ప్రవేశపెట్టిన 48 లక్షల 21 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు కనీసం ఒక రూపాయి కేటాయించకపోవడం తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన ఒక్క ఎంపీ కూడా మాట్లాడకపోవడం సిగ్గుచేటని ఇప్పటికైనా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ప్రధానమంత్రి తో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన వాటాను తీసుకురావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు రామంచ ( చింటు మెస్సి )అంజి ఉపేందర్ రాజకుమర్ వినయ్ రంజిత్ శేఖర్ మణిరత్నం అనిల్ తదితరులు పాల్గొన్నారు

Exit mobile version