లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు
మోటకొండూర్ నాంచారి పేట గ్రామ వాస్తవ్యులు కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి కంది అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కుటుంబ సభ్యులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్ పర్సన్ కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి దయతో పసి హృదయాల మధ్య మా బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శశిధర్ రెడ్డి ఫౌండేషన్ డైరెక్టర్ కంది శ్వేతా రెడ్డి కంది హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.