*ఘనంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జన్మదిన వేడుకలు*
*అనాధాశ్రమంలో కేకు పండ్లు పంపిణీ – అంబాల రాజు*
*జమ్మికుంట జులై 21 ప్రశ్న ఆయుధం*
కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం జన్మదినాన్ని పురస్కరించుకొని జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి స్పందన అనాధాశ్రమంలో జమ్మికుంట మండలం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జమ్మికుంట మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తన ప్రస్థానం కార్యకర్తగా మొదలుకొని ప్రజాసేవకై మండల ప్రజా పరిషత్ సభ్యురాలుగా ఎన్నికై ప్రజలకు సేవలు అందించి నేడు తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వారందించిన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తర తెలంగాణలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరుగాంచిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్ పర్సన్ గా నియమించడం రైతు సోదరుల సేవలో నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై అనునిత్యం శ్రమిస్తున్న పుల్లూరి స్వప్న సదానందం జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి జన్మదిన వేడుకలు రానున్న రోజుల్లో మరెన్నో జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకున్నారు అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయినా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు లకు అంబాల రాజు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జమ్మికుంట మండల ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ఉప్పల సాంబశివరెడ్డి యువజన కాంగ్రెస్ మడిపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు ల్యాదల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు