ఘనంగా పూలిమామిడి మమత రాజు జన్మదిన వేడుకలు
సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 1 (ప్రశ్న ఆయుధం న్యూస్): కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మరియు పీ.ఎం.ఆర్ డెవలపర్స్ అధినేత సతీమణి పులిమామిడి మమత రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పులిమామిడి రాజు పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పీఎంఆర్ సభ్యులు మాట్లాడుతూ.. మృధు స్వభావం, సేవాభావం కలిగిన వ్యక్తి, నిరుపేదలకు తగిన సహాయం అందించడం, వ్యాపారంలోనూ రాజు అన్నకు పలు సూచనలు, సలహాలు ఇస్తూ, తన భర్త అడుగు జాడల్లో నడుస్తూ కరోనా సమయంలో ఎంతో మందికి వారు సహాయాన్ని అందించారని, అనారోగ్యంతో బాధ పడుతున్నటువంటి వారికి చేయూతనందిస్తున్నారని తెలిపారు. ప్రజా సేవే లక్ష్యంతో ముందుకు కొనసాగుతున్నటు వంటి తరుణంలో ఆమె చేసిన సేవకు గాను త్వరలో సేవా రత్న అవార్డు అందుకుంటారని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికలలో పులిమామిడి మమత పొటీ చేయనున్నట్లు పీఎంఆర్ యువసేన నాయకులు తెలియజేశారు. మమత ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఆయురాఆరోగ్యాలతో ఉండాలని, ప్రజలకు మరింత సేవను అందించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాగం అనిల్, చిన్న, గుణాకర్, తాలెల్మ రాము, వెంకట్, మనోజ్, మధు, లక్ష్మి, ప్రవీణ్, శరత్, మలాన్, బాల్ రాజ్ , యాదన్న, అఖిల్, నరేష్, వీరేశం, మణి, సోమ శంకర్ తదితరులు పాల్గొన్నారు.